తెలుగుదేశం ప్రభుత్వంలో ఆప్కో ఛైర్మన్ గా పనిచేసి ఖాజీపేటకు చెందిన గుజ్జల శ్రీను ఇటీవల దూకుడు పెంచారా ? వైసీపీ ప్రభుత్వం ఆఫ్కో డైరెక్టర్ పదవి కట్టబెట్టిన ఉదయగిరి వెంకటేశ్ ( ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి ముఖ్య అనుచరుడైన ) ప్రమాణ స్వీకారం జరక్కుండానే అడ్డు కట్ట వేయడంలో సఫలీకృతమైనట్లేనా?
రిపోర్ట్ : నందిరెడ్డి నాగశివారెడ్డి
ఆప్కో మాజీ చైర్మన్ గుజ్జల శ్రీను చేనేత కార్మికుల పేరు మీద తప్పుడు సంఘాలు, ఖాతాలు, సభ్యులను సృష్టించి రూ.వందల కోట్ల మేర నిధులను స్వాహా చేశారని..సహకార సంఘాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన కోట్ల రూపాయల నిధులను దారి మళ్లించి.. ఆ నిధులతో గుజ్జల శ్రీను కడపలో 89 స్థిరాస్తులను కుటుంబ సభ్యుల పేరు మీద కూడబెట్టారని సీఐడీ హైకోర్టులో ఫిటిఫిన్ వేసిందని.. నివేదించిందని.. అవినీతి కేసులో ఇప్పటివరకు 174 మంది సాక్షులను విచారించడం జరిగిందని.. గుజ్జల శ్రీనుపై అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్ట్) కింద కేసు నమోదు చేయడం జరిగిందనే కథనాలు వచ్చాయి.. అంతేకాదు.. స్కాంను బట్టబయలు చేసేందుకు సీఐడీ రంగంలోకి దిగిందనే ప్రచారం అప్పట్లో బాగా జరిగింది.. ఈ స్కాంకు సంబంధించి ఖాజీపేటలోనే కాకుండా.. గుజ్జల శ్రీనుకు కేంద్రబిందువైనప్రాంతాల్లో దాడులు కూడా జరిగిపోయాయి. గుజ్జల శ్రీను అవినీతి, అక్రమాలపై పూర్తి స్ధాయి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలంటూ మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అంతే కాదు.. గుజ్జల శ్రీను అవినీతిపై పూర్తి స్ధాయి విచారణ చేసి.. స్వాహా చేసిన నిధులు రికవరీ చేసి కఠిన చర్యలు తీసుకోవాలంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి అధికారం వచ్చిన మొదట్లోనే ఫిర్యాదు చేశారనే ప్రచారం ఉంది..
తనపై ఇంటా బయటనే కాకుండా.. అధికారపార్టీకి చెందిన నాయకుల బెదిరింపుల ఫలితమో? .. సీఐడీ, సిబిఐ, ఈడీ వంటి సంస్థలతో విచారణ చేయాలంటూ కొందరు నేతల డిమాండ్ చేయడం కారణమో..? కేసుల పరంపరంతో పాటు.. అధికార సంస్థల దాడులకు కు భయపడ్డారో? ఇంకోక విధంగా వచ్చే వత్తిడిలకు, బెదిరింపులకు భయపడ్డారో..? కానీ గత రెండు, మూడేళ్లు గా గుజ్జల శ్రీను బెంగుళూరుకు మకాం మార్చాడనే ప్రచారం ఉండిపోయింది. ఖాజీపేటలో గుజ్జల శ్రీను ఛాయలు తక్కువనే మాట కూడా వినపడుతోంది. హఠాత్తుగా ఈ మధ్య కాలంలో మళ్లీ శ్రీను పేరు అందరి నోట వినపడుతోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆప్కో డైరెక్టర్ పదవి ఉదయగిరి వెంకటేశ్వర్లుకు రావడం.. ఆపదివీ బాధ్యతలు తీసుకోకుండా అడ్డుకట్ట వేయడంలో గుజ్జల శ్రీను సక్సస్ అయ్యారని వైసీపీపార్టీ నేతల్లో ఒక చర్చనడుస్తోంది..
డైరెక్టర్ పదవి లభించింది.. ప్రమాణ స్వీకారం చేయకముందే రద్దైయింది..!
మైదుకూరుకుచెందిన ఉదయగిరి రాందాసు కుమారుడు వెంకటేశ్వర్లు.. ప్రొద్దుటూరులో రామేశ్వరం చేనేత కమిటీ వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ నడుపుతున్నాడు.. ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డికి అంత్యత సన్నిహితుడు.. అది ఎంతగా అంటే.. నిత్యం అంటిపెట్టుకునే ఉండేంత.. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఆప్కో సంస్థలో నామినేటెడ్ పదవి ఆశిస్తూ వస్తున్నారు ఉదయగిరి వెంకటేశ్వర్లు. ఎమ్మెల్యే రఘురామిరెడ్డి కూడా ఆప్కో లో నామినేటేడ్ పదవి ఇప్పించే ప్రయత్నం ఆరంభం నుండి చేస్తూ వస్తున్నట్లు సమాచారం.. ఆఫ్కోలో ఉదయగిరి వెంకటేశ్కు పదవి రాకుండా జగన్‌ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న ప్రధానసలహాదారుడి ద్వారా గుజ్జల శ్రీను అడ్డుకట్ట వేయడం వల్లే మూడున్నర ఏళ్లు పదవి నోచుకోలేదనే ప్రచారం ఉండిపోయింది.
వెంకటేశ్ ను సీఎం వద్దకు తీసుకెళ్లిన రఘురామిరెడ్డి…
మూడున్నర ఏళ్లుగా తమ ప్రతిపాధనలకు బ్రేక్ పడుతుండటం వల్లనేమో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి వెంకటేశ్‌కు పదవి ఇప్పించి విషయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డికి వద్దకు వెళ్లారు.. తన చిన్నకుమారుడుతో పాటు చేనేత రంగంలో మనప్రాంతానికి చెందిన పట్టుపోగుల పుల్లయ్య లాంటి వాళ్లను వెంటబెట్టు కెళ్లారు. సీఎంపై వత్తిడి తెచ్చి ఎట్టకేలకు ఉదయగిరి వెంకటేశ్ కు ఆప్కో డైరెక్టర్ పదవి ఇప్పించడంలో ఎమ్మెల్యేకృతకృత్యులయ్యారు.. వెంకటేష్‌తో పాటు, పట్టుపోగల పుల్లయ్య తదితరులను సీఎం జగన్ వద్దకు తీసుకెళ్లిననేపథ్యంలో వైసీపీపార్టీలో కొంత వ్యతిరేకత వ్యక్తమైంది..
సీఎంను కలవాలనే ఆశ నియోజకవర్గంలో ప్రముఖులుగా చెలామణిఅవుతున్న వైసీపీ నాయకుల్లో బలంగా ఉండేది.. మమ్మల్ని విస్మరించి చేనేత రంగ ప్రముఖులను సీఎం వద్దకు రఘురామిరెడ్డి తీసుకెళ్లడంను కొందరు జీర్ణించుకోలేక పోయారని సమాచారం. సీఎంను కలిసిన నేపథ్యంలో ఉదయగిరి వెంకటేశ్ ను ఆఫ్కో డైరక్టర్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది.
చివరి దశలోనైనా తనకు డైరెక్టర్ పదవిరావడంతో సంతృప్తి చెందిన ఉదయగిరి వెంకటేశ్.. రఘురామిరెడ్డికి పాధాభివందనం చేసి తనకున్నభక్తిని ప్రదర్శించుకున్నారు.. ఇక పదవీ బాధ్యతలకు సిద్దపడుతున్న తరుణంలో హైకోర్టు నుండి స్టే వచ్చింది.. ఆప్కో ఛైర్మన్ తోపాటు,. డైరెక్టర్ పదవీ బాధ్యతలు చేపట్టినా ఉదయగిరి వెంకటేశ్‌కు ఆ అవకాశం కల్పోయారు.. దీని వెనక పెద్ద కథ నడించిదా..
సొసైటి అక్రమాలను బయటపెడుతూ హైకోర్టులో ఫిటిషిన్ వేసిన గుజ్జల శ్రీను అనుచరుడు..!
ఒకే మండలం.. ఒకే కులం.. ఓకేరంగం అయినప్పటికీ గుజ్జల శ్రీనుకు,ఉదయగిరి వెంకటేశ్ కు మధ్య విబేధాలు ఎందుకు వచ్చినట్లు.. ? అది డైరెక్టర్ పదవి దక్కకుండా చేసేంతగా రావడం పెద్ద చర్చకు దారి తీయడమే కాకుండా ఏమి జరిగి ఉంటుంది అనే కోణంలో గుసగుసలాడుకుంటున్నారు.. గుజ్జల శ్రీను ఆప్కో ఛైర్మన్ గా ఉన్నకాలంలో వెంకటేశ్ సఖ్యతగా ఉండేవారని.. ఆసఖ్యత కూడా చేనేత రంగం లావాదేవిలు, ఒడంబడికలు ఉండేలా.. వైసీపీ అధికారంలోకి రాగానేఅక్రమ కేసుల బెదిరింపులు.. డబ్బుల డిమాండ్ వంటివి చోటు చేసుకున్న నేపథ్యంలో ఉదయగిరి వెంకటేష్ పై కసితో పాటు.. పదవికి నోచుకోకుండా చేయాలనే దృక్పధంలో గుజ్జల శీను ఉండిపోయారనే వాదన కూడా నడుస్తోంది. డైరెక్టర్ పదవి ఉత్తర్వులు వెలువడగానే పాత ఖాదరాబాద్ హ్యాండ్లూమ్ వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ. అధ్యక్షుడు చెన్నశ్రీనివాసులు ద్వారా వెంకటేశ్‌సొసైటి లోని అక్రమాలు చూపుతూ హైకోర్టులో కేసు వేసి ప్రభుత్వ ఉత్తర్వులు గుజ్జల శ్రీను రద్దు చేయించారనే వార్త అందరి నోట వినపడుతోంది..
స్టే తెప్పించి అడ్డుకట్ట వేసిన గుజ్జలపై ఎమ్మెల్యే స్పందన ఏలా ఉంటుందో?
ఉదయగిరి వెంకటేశ్ కు ఆప్కో డైరెక్టర్ పదవి వచ్చిందంటే సీఎంజగన్ మోహన్‌రెడ్డిపై ఎమ్మెల్యే రఘురామిరెడ్డి వత్తిడి తేవడం వల్లేసాధ్యమైందని జగమెరిగిన నిజం.. అంత కష్టపడి.. సీఎం వద్దకువెళ్లి తను తెచ్చిపెట్టిన పదవికి అడ్డుకట్ట వేసే ధైర్యం ఆప్కో మాజీ ఛైర్మన్ గుజ్జల శ్రీను ఎలా వచ్చింది? అదీ వైసీపీ ప్రభుత్వంలో శెట్టిపల్లెరఘురామిరెడ్డిపైనే ఢీ అంటే ఢీ అనే వరకు వెళ్లడం వెనుక శీనుకు ఉన్నబలమేంటి? బలబలాలు ఏంటి? అన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. డైరెక్టర్ పదవికీ అడ్డుపడిన తీరుపై ఎమ్మెల్యే రఘురామిరెడ్డి స్పందన అటు ప్రభుత్వ పరంగా కానీ, ఇటు రాజకీయ పరంగా కానీ లేకపోవడంతో ‘‘గుజ్జల శ్రీనుకు, ఎమ్మెల్యేకు సఖ్యత పెరిగిందని.. ఆకారణంగానే సీఎం కు చేసిన ఫిర్యాదును గాలికి వదిలేశారని.. .వీరి మధ్య మైత్రీ బంధం కొనసాగుతోందంటూ’’ ఇటీవల డీఎల్ రవీంద్రారెడ్డి అన్న మాటలను అనువయించుకుంటూ గుసగుసలాడుకుంటున్నారు. ఉదయగిరి వెంకటేశ్ కు డైరెక్టర్ పదవి దక్కకుండా చేయాలన్న కసితో కక్షతో గుజ్జల శ్రీను వ్యవహరిస్తున్న తీరు చూస్తే.. వైసీపీ ప్రభుత్వంలోనే కాదు.. ఆప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న వారి అండదండలు పుష్కలంగా ఉన్నాయి..ఉంటున్నాయి అనే వాదన ఏమేర కరెక్టో.. ఆపార్టీ లోని పెద్దల స్పందనను బట్టి విదితమవుతుంది..