➡️ “ప్రజానేత”ల బహిరంగ వ్యాఖ్యలే అవినీతి.. అక్రమాలకు ప్రామాణికాలా ?
➡️ డబ్బులే పరమావధిగా ఈ సెగ్మెంట్ లో రాజకీయాలు నడుస్తున్నాయా.?
-నందిరెడ్డినాగశివారెడ్డి, జర్నలిస్టు
మన ప్రాంతాభివృద్ధి కుంటుపడటానికి.. ప్రజలకు ప్రభుత్వ సేవలు అందడంలో అలసత్వానికి పాలకుల విధివిధానాలే కారణమా? నేటి రాజకీయ వ్యవస్థలోకి అధికార దాహముతో డబ్బులు సంపాదనే ధ్యేయంగా రాజకీయాల్లోకి ప్రవేశించడం వల్ల.. సేవా ధృక్ఫథమున్న నాయకులు దూరమవ్వడం వల్ల.. శాసన వ్యవస్థ బలహీనపడిందనే వాదన నిజేమేనా? ఇప్పటి నాయకులు ప్రజా సమస్యలను గాలికి వదిలి కమీషన్ల వసూళ్లకై రాజకీయం నెరుపుతున్నారా? పదవులు కట్టబెట్టడిన ప్రజలకు సేవ చేయాలనే సామాజిక బాధ్యత ను గాలికి వదిలేశారా? ఇప్పటి పరిపాలనలో డబ్బే ప్రాధ్యాన్యతై కూర్చుందా? ఆ డబ్బే ప్రజలను దూరం చేయబడుతుందా? నియోజకవర్గంలో కొందరిని శత్రువులుగా తయారు చేస్తోందా?
ఇలాంటి సంస్కృతి సాంప్రదాయాలు మన నియోజకవర్గంలో చోటుచేసుకున్నాయా..? అందుకేనా రాజకీయ విలువల మంటగలుస్తున్నది..? వారి వారి హుందా తనంను మటుమాయం చేస్తున్నది ఇందుకేనా. ? మనప్రాంతంలో చేపట్టే ప్రతి అభివృద్ధిలో గురుతర బాధ్యత కల్గిన ప్రజాప్రతినిధులు అవినీతి,అక్రమాల బురద ఎందుకు చల్లుకుంటున్నారు? బహిరంగ విమర్శలను ఎందుకు ఎదుర్కొవలసి వస్తోంది? అవినీతి, అక్రమాల బురదను తనపై జల్లుకుంటూ.. జల్లింప చేసుకుంటూ నేతలు కొందరు ఛీదరింపులకు గురికావాల్సిన ఆవశ్యకత ఎందుకొస్తోంది.. నిజంగా అవినీతి అక్రమాల్లో ప్రజాప్రతినిధులకు సంబంధాలున్నాయా? అదే దిశగా పాలన సాగుతోందా? అన్నప్రశ్నలకు సందేహాలు పెరగడమే తప్ప.. క్వాలిటీ… క్లారిటీ అంశంలో వాస్తవాలు బయటకు వెలుగు చూడటం లేదు.. అందుకేనేమో.. నియోజకవర్గంలో తరచూ అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి.. అవి ఎంతగా అంటే.. దా తేల్చుకుందాం.. ప్రమాణాలు చేద్దాము.. ఎన్నికల్లో నిలబడదాం.. అన్నంత కసిగా సవాళ్లు.. ప్రతి సవాళ్లు విసరుకునేంతగా..?
దశాబ్ధాల రాజకీయ నేపథ్యం కల్గిన కుటుంబంకు చెందడమే కాకుండా.. నియోజకవర్గ ప్రజామోదం కల్లిన నేతలే ఘాటైన విమర్శలు చేసుకున్న తీరే కాకుండా.. ఈ ప్రాంతంలో అక్రమాలు,అవినీతి గురించి ప్రతిపక్షంకు ప్రాతినిధ్యం వహిస్తున్న నేత సైతం ఆరోపణలు చేయడమే కాకుండా.. అవినీతి అక్రమాలు గుట్టు రట్టు చేసేందుకు ఏకంగా కోర్టునే ఆశ్రయించిన నేపధ్యంలో అవినీతికి.. అక్రమాలకు మైదుకూరు సెగ్మెంగ్ కేరాఫ్ గా మారిందనే అభిప్రాయం నియోజకవర్గ వ్యాప్తంగా బలంగా వ్యాప్తి చెందుతోంది.
అవినీతి అక్రమాలను ప్రామాణికానికి ఇవే సాక్ష్యాలా..?..
మన నియోజకవర్గ రాజకీయ వ్యవస్థను గమనిస్తే.. మొదట్లో హుందగా రాజకీయం కొనసాగేది.. అభివృద్ధి పరంగా విమర్శలు ఉండేవి.. ఎన్నికల సమయంలోనే ఆరోపణలు, ప్రత్యారోపణలుకు దిగేవారు. ఎన్నికల కదా ఒకరిమీద మరోకరు విమర్శ చేసుకోవడం సహజమే అన్నట్లు ఉండిపోయేది. ఎన్నికలు లేకున్నా.. రాజకీయ సందర్భం లేకున్నా విమర్శల పరం కొనసాగుతోంది.. ఆ విమర్శలు అభివృద్ధి విషయంలో కాదు.. డబ్బులు చుట్టే సాగుతోంది.. ముఖ్యంగా ఎమ్మెల్యే రఘురామిరెడ్డిపై అసంఖ్యాక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి..
నియోజకవర్గంలో అయిదు దశాబ్ధాల రాజకీయ నేపథ్యం కల్గిన డీఎల్ రవీంద్రారెడ్డి తోపాటు..అడపదఢపా తెలుగుదేశం పార్టీనియోజకవర్గ ఇన్‌చార్జ్ పుట్టాసుధాకర్ యాదవ్ సైతం.. ‘‘ ప్రతిపనిలో డబ్బులు.. డబ్బులు కోసమే పాలన.. పదవి కావాలన్నా.. పోస్టు ఇవ్వాలన్నా డబ్బులే డబ్బులు.. ప్రతి అంశంను అనుకూలంగా మార్చుకుండూ డబ్బుెల పాలన కొనసాగిస్తున్నాడంటూ’’ గత రెండేళ్లుగా ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పై ప్రెస్మీట్ మీద ప్రెస్మీట్ పెడుతూ మాజీ మంత్రి డీఎల్ విమర్శల మీద విమర్శలు చేస్తున్నారు.. అంతే కాదు రానున్న ఎన్నికల్లో ప్రజలు తరమితరమి కొడతారు అంటూ అనర్గళమైన .. దూషణలతో కూడిన వ్యాఖలు సందర్భంను బట్టి సంధిస్తూనే ఉన్నారు.. డీఎల్ వ్యాఖ్యల దుమారంను బట్టి.. ఆరోపణలు బట్టి ఎమ్మెల్యే రఘురామిరెడ్డి సైతం ‘‘ అవినీతిలో మీరు కూడా అగ్రగణ్యులే.. డబ్బులు కోసమే ఆరోపణలు అంటూ’’ తనదైన శైలిలో విమర్శలు సంధించారు..
తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్ పుట్టా సుధాకర్ యాదవ్ సైతం ‘‘ నియోజకవర్గంలో అధికార పార్టీ అక్రమాలకు,అవినీతికి పాల్పడుతూ.. దోపిడి సాగిస్తోందంటూ ’’ విమర్శలు చేయడమే కాదు.. నంద్యాలంపేట ప్రాంతంలోని ఎమ్మెల్యే భూ ఆక్రమణకు పాల్పడ్డారంటూ కోర్టును ఆశ్రయించారు..అలాగే కుందూ నదిలో.. చాపాడు మండలం రాజుపాళెం వల్ల ఇసుక అక్రమాలపై కోర్టు వరకు వెళ్లారు.. మీరేమి అవినీతిలో తక్కువేమి కాదంటూ మైదుకూరు పురపాలికలో తెలుగుతమ్ముళ్లు అవినీతి గురించి రఘురామిరెడ్డి పుట్టాపై విమర్శలు సంధిస్తూ వచ్చారు. వారి వారి ఆధారాలు ఆధారంగా బహిరంగ వ్యాఖ్యలు.. వెల్లడిస్తున్న తీరును పరిగణలోకి తీసుకున్న నేపథ్యంలో మైదుకూరు సెగ్మెంట్ అవినీతికి, అక్రమాలకు కేంద్రబిందువైందని అభిప్రాయం వ్యక్తంమవుతోెంది
పార్టీ కోసం పనిచేయాల్సిన అవసరం లేదా? డబ్బులు ఉంటే పదవులు సొంతమవుతాయా?
ఇటీవల కాలంలో పొలిటికల్ గా లభిస్తున్న పదవులు.. ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీ టిక్కెట్లు, అధికారిక పదవులు లభిస్తున్నతీరును విశ్లేషించుకుంటే.. పార్టీకి పనిచేయాల్సి న అవసరం లేదు.. డబ్బులు పుష్కలంగా ఉంటేచాలు అనే సిద్దాంతం బాగా అమలవుతున్నట్లు ఉంది.. ముఖ్యంగా ఇటీవల వైసీపీ పార్టీలో ఈ సిద్దాంతంగా బాగా వర్కవుట్ అవుతున్నట్లు ఉంది. నియోజకవర్గ వ్యాప్తంగా అయిదు మండలాల్లో కొందరు ప్రజాప్రతినిధులుగా ఎంపిక.. అధికారిక పదవులు.. నామినేటేడ్ పదవులు పొందిన నాయకులను గురించి అలా దృష్టి పెట్టగలుగుతే.. ఈ మధ్య కాలంలో వైసీపీ ఓటు వేసి ఉండొచ్చు.. మేము అసలైన వైసీపీ పార్టీ నేతలమని గర్వంగా చెప్పుకొవచ్చు.. కానీ, వైసీపీ పార్టీ పెట్టి.. ఎంపీకి రాజీనామా చేసి ‘‘ఢిల్లీకి కడపకు’’ పోటీ అంటూ ఇప్పటి ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ మోహన్ రెడ్డి కడప ఎంపీ గా ఉప ఎన్నికలప్పుడు ఓటు వేయకున్నా పదవులు ఎలా పొందగలిగామన్న ఆత్మ విమర్శ చేసుకుంటే.. పార్టీకీపనిచేస్తే పదవులు పొందామా? మరో విధంగా సొంతం చేసుకున్నామా అన్నది నిర్ధారణవుతుంది. పార్టీకి పనిచేయని వారికి కూడా ఉన్నత పదవులు లభించడం వెనుక మర్మం ఏంటీ? అన్న సందేహం పూర్వవైసీపీ పార్టీ క్యాడర్ నుండి వ్యక్తమవుతోంది.. డబ్బులు లేకనే పదవులకు దూరంగా ఉండిపోయామనే బాధ కూడా కొందరిలో తాండవిస్తుండగా.. మరి కొందరిలో నిటూర్పు కల్గిస్తోంది…
దేవుళ్లకు కూడ ప్రశాంతత కొరవడుతోందా?
రాజకీయం అంటే ఏదో వ్యక్తిగత వ్యవహారం కాదు. ప్రజాక్షేత్రంలో నిలబడి, ప్రజల కోసం చేసే పని. ప్రజల ద్వారా ఎన్నుకోబడిన నేతలకు ప్రజలే సాక్షులు, ప్రజకే న్యాయనిర్ణేతలు. ఏదైనా ప్రజల ద్వారానే తేలాలి. తేడాలు వస్తే ప్రజల ముందే నిరూపించుకోవాలి. ఇక్కడంతా ప్రజాస్వామ్యమే తప్ప దైవస్వామ్యాన్ని చోటు లేదు. అసలు ప్రజాస్వామ్యంలో దేవుడికి పనేం ఉంటుంది. దేవుడు దేవుడే, రాజకీయం రాజకీయమే. రెంటినీ మమేకం చేస్తూ మన నేతలు యథేచ్ఛగా సవాళ్లు, ప్రతిసవాళ్లు చేసేసుకున్నారు.. అవినీతి, అక్రమాలపై ఇటీవల మైదుకూరులో మాజీ మంత్రి డీఎల్, ఎమ్మెల్యే రఘురామిరెడ్డిలు మధ్య చోటుచేసుకుంటున్న మాటల యుద్ధాలు, ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఆరోపణలు వెరసి దేవుళ్ళ ముందు సత్య ప్రమాణాలు చేసుకునే విషయంలో మాటల వరకు అయితే మాట్లాడేసుకున్నారు..
తమ నిజాయితీని నిరూపించుకోవడానికి దేవుళ్ళనే సాక్ష్యులుగా, జడ్జీలుగా పెట్టుకున్నారు. వీరి ప్రకటనల వల్ల దేవుళ్లకు ఎక్కడ తిప్పలో అన్నుకుంది మైదుకూరు ప్రజానీకం.. తర్వాత ఆ మాటలు లేవు.. ఆ సవాళ్లులేవు.. ప్రమాణాలు విషయంలో అంతా సైలెంట్.. ఇక్కడ ఆలోచించాల్సింది ఒకటి ఉంది.. ప్రజాక్షేత్రంలో పారదర్శకత పాటించి ప్రజల ముందు స్వచ్ఛంగా కనబడాల్సిన నాయకులు ఇలా పరస్పర అవినీతి ఆరోపణలతో దేవుళ్ళ మీద ప్రమాణాలు అంటూ మాట్లాడటం ఈమేరకు విజ్ఞత అనిపంచుకుంటుందో అన్న ప్రశ్న తెలత్తుతోంది.. అయినా ఓట్లు వేసింది గెలిపించింది ప్రజలు అయినప్పుడు మధ్యలో దేవుళ్లను బలవంతాన తీసుకొచ్చి భక్తుల భావోద్వేగాలతో ఆదుకోవడం సబబే కాదనే వాదన వినపడుతోంది.. అవినీతిని వెల్లడించే క్రమంలో ప్రజావేదికలను వినియోగించుకోవడం సబబుగా ఉంటుందనే భావన రాజకీయమేధావుల్లో వ్యక్తమవుతోంది.