*సెల్పీ మాట్లాడి.. ‘‘క్రిష్ణమ్మ’’లో లీనమయ్యే సాహసంకు ఓడిగట్టిన మహిళ..!
* ‘‘ఏడు కొండలు’’ వాడేనా.. ఈ వెంకటరమణా (కానిస్టేబుల్)..!
*బ్రహ్మసాగర్ జలాశయంలో ప్రాణాలు తీసుకోబోయిన ‘‘జిలేఖా’’..
*ప్రాణాలను తీసుకునేవరకు తీసుకువచ్చిన చీటీల నిర్వాహణ
*కానిస్టేబుల్ ‘‘వెంకటరమణ’’కు ప్రశంసల జల్లు…
-నందిరెడ్డి నాగశివారెడ్డి, జర్నలిస్టు
తిరుమల వెళ్లగానే .. ఏడుకొండల వాడా.. వెంకటరమణ..గోవిందా.. గోవిందా అంటూ పాడతాం.. స్మరించుకుంటాం… ఎందుకు అలా పాడతాం అంటే మన కష్టాలను ఏడుకొండల స్వామి కడతేర్చుతాడని.. ఆయన అనుగ్రహంతో పరోక్షంగా సాయం అందిస్తాడని.. బ్రహ్మసాగర్ వద్ద అదే జరిగింది.. జిలేఖా విషయంలో అదే జరిగింది.. కష్టాల కడగండ్లను కడతేర్చుకోలేక ప్రాణాలు వదులుకుంటున్న తరుణంలో ఆఏడుకొండలవాడు.. ఇక్కడి వెంకటరమణ( కానిస్టేబుల్ )ను పంపించి జిలేఖా ప్రాణాలను పరిరక్షించాడు.. సెల్పీ మాట్లాడమేంటి? క్రిష్ణమ్మలో లీనమేంటి? ఏడు కొండలు వాడి ప్రస్తావన ఏంటి? ఈ వెంకటరమణా ఎవ్వరు? అన్నది .. శనివారం బ్రహ్మంగారి మఠం సమీపంలోని బ్రహ్మసాగర్ వద్ద ఏమి జరిగిందో తెలుసుకుందాం..
బద్వేల్ లోని దూదేకుల వీధికి చెందిన జిలేఖా … ఈమెకు ముగ్గరు పిల్లలు.. పెండ్లిండ్లయ్యాయి.. డబ్బు సంపాదన కోసం చీటి వ్యాపారం నడుపుతోంది.. చివరకు పది లక్షలు అప్పులు మిగిల్చుకుంది.. ఈ అప్పుల భారం నుండి బయట పడే మార్గం లేక ప్రాణాలు వదుకులునేందుకు బ్రహ్మసాగర్ జలాశయంను ఎంచుకుంది.. బద్వేల్ నుండి ఆటో తీసుకుని బలాశయం వద్దకు చేరింది. జిలేఖా దిగగానే ఆటో వెళ్లిపోయింది. నాకు ఈ పరిస్థితుల్లో క్రిష్టమ్మలో లీనమయి పోదామని జలాశయం పై భాగం నుండి నీటిలోకి దిగింది.. ఇక నీటిలోకి వెళ్లడమే.. ఆ తరుణంలో తన వద్ద సెల్ తీసి సెల్పీ చేసింది.. అదే సమయంలో జలాశయం పై రోడ్డు వెంబండి కానిస్టేబుల్ వెంకటరమణ వెళ్తున్నారు.. జలాశయంలో నీటి సమీపంను ఒక్క మహిళే కనపడటం.. అదీ సెల్పీ మాట్లాడుతుండటంను గమనించాడు.. సెల్పీ కాల్ ముగియగానే నీటిలోకి వెళ్తోంది.. సెకన్లలోపే నీటిలోకి దూకేయబోయింది.. ఈమె ఆత్మహత్య చేసుకోబోంతోదని క్షణాల్లో గ్రహించిన కానిస్టేబుల్ తన శక్తినంత కూడదీసుకుని రాళ్లమీద పరుగులు తీస్తూ నీటిలోకి దూకేశాడు..జిలేఖాను ఆత్మహత్య నుండి కాపాడారు.. నీటిలోకి దూకే సమయంలో పక్కనపడేసిన సెల్ తీసుకుని జిలేఖ ఆత్మహత్య కు పాల్పడిన సమాచారం వారి బంధువులకు చేరవేశారు. అలాగే తన స్టేషన్ అధికారికి ఘటన గురించి తెలియజేశారు.
పోలీసు ఉన్నతాధికారికి ఘటన నేపథ్యంను తెలియజేసి బి.మఠం పోలీసుస్టేషన్ కు తీసుకువచ్చారు.. జిలేఖా కు ఎస్ఐ విద్యాసాగర్ కౌన్సిలింగ్ ఇచ్చి వారి బిడ్డలకు అప్పగించారు.సాహసోపేతంగా వ్యవహరించి తన తల్లి ప్రాణాలు కాపాడిన పోలీస్ కానిస్టేబుల్ వెంకటరమణ కు కృతజ్ఞతలు తెలిపారు. జీవితాంతం పోలీస్ శాఖకు రుణపడి ఉంటామన్నారు.
ఆత్మహత్మకు పాల్పడిన జిలేఖా ప్రాణాలు కాపాడిన పోలీసు కానిస్టేబుల్ వెంకటరమణరను పోలీసు ఉన్నతాధికారుల నుండే కాదు.. స్ధానిక ప్రజల నుండి ప్రశంసిస్తున్నారు.. మహిళ ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ వెంకటరమణ ను జిల్లా ఎస్.పి శ్రీ కే.కే.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్ ప్రత్యేకంగా అభినందించారు. స్ఫూర్తిదాయక సేవలందించి జిల్లా పోలీస్ శాఖ ఔన్నత్యాన్ని మరోసారి చాటారని ఎస్పీ కే.కే.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్ పేర్కొన్నారు.