నాపేరు నందిరెడ్డి నాగశివారెడ్డి.. 1997 లో నుండి జర్నలిజం వృత్తి. ఆంధ్రభూమి, డక్కన్ క్రానీకల్, టీవీ9, ఎన్టీవీ, సాక్షి సంస్ధలో జర్నలిస్టుగా పనిచేశాను. 2022 వరకు టీవీ9 సంస్ధలో రిపోర్టర్ గా విధులు నిర్వర్తించాను. జర్నలిజంలో పనిచేస్తూనే మా ప్రాంత చరిత్రను పుస్తక రూపంలో( కడప ద్విశతాబ్ధి ఉత్సవ పురస్కరించుకుని) అందించాను.. పలు రచనలు చేశాను.. సంపాదకీయ కథనాలు అందించాను. గ్రామీణ నేపథ్య కథనాలు అందించి పూర్వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తమ గ్రామీణ జర్నలిస్టు అవార్డు అందుకున్నాను. జర్నలిజంలో నాకున్న పాతికేళ్లపైగా అనుభవంతో website ద్వారా సామాజిక కథనాలతోపాటు.. మా ప్రాంత వార్తలు, విశేషాలు, రాజకీయం, వ్యవసాయం వంటి కథనాలు సమగ్రంగా అందించే ప్రయత్నమిది